Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

50 రోజులకి చేరువలో 'ఇస్మార్ట్ శంకర్' .. నిధి అగర్వాల్ ఆనందం

  • పూరి నుంచి వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్'
  • బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు 
  • ఫస్టు హిట్ తో ఖుషీ అవుతోన్న నిధి అగర్వాల్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది. నిధి అగర్వాల్ - నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. జూలై 18వ తేదీన విడుదలైన ఈ సినిమా ఈ గురువారంతో 50 రోజులను పూర్తి చేసుకోనుంది.ఈ సినిమా 50 రోజుల మైలురాయిని చేరుకుంటుండటం పట్ల, హీరోయిన్ నిధి అగర్వాల్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను పోస్ట్ చేసింది. ఇంతకుముందు నిధి అగర్వాల్ తెలుగులో చేసిన రెండు సినిమాలు ఆమెను నిరాశపరిచాయి. బాగా డీలాపడిపోయిన సందర్భంలో వచ్చిన ఛాన్స్ తో హిట్ కలిసొచ్చినందుకు ఆమె సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా ఇంకా కొన్ని థియేటర్స్ లో రన్ అవుతోందని చెబుతూ పొంగిపోతోంది.
Ram
Nidhi
Nabha

More Telugu News